X Close
X
+91-9866010944

“సరిలేరు నీకెవ్వరు” చిత్రం పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు


sari-1

రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో అదరగొట్టిన తర్వాత ఆ మలి చిత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ అయ్యి హిట్ కొట్టాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకున్న రోజు రానే వచ్చింది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ మొదటి షో పడిపోయింది.

ఈ చిత్రం మొదలయ్యినప్పటి నుంచీ మంచి హడావుడి చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ రోజురోజుకు అంతే స్థాయిలో పెంచుతూ వెళ్తూ ఈ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసారు.అలా ఎదురు చూసిన ఈ బొమ్మ ప్రీమియర్స్ తో పడేసరికి అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్ లైన్ లో మహేష్ ఫ్యాన్స్ హంగామా మాములుగా చెయ్యడం లేదు.ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా థియేటర్ లో సీన్స్ పెట్టేస్తున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

The post “సరిలేరు నీకెవ్వరు” చిత్రం పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు appeared first on Telugu Bullet.

(TELEGU BULLET)