X Close
X
+91-9866010944

నటి ఖుష్బూ ఇంటిదగ్గర్లో అనుమానాస్పద వెహికల్…ట్వీట్


Hyderabad:

ప్రముఖ నటి ఖుష్బూ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉన్నారు. ఇక ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిజానికి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యింది. అయితే ఆమె చెన్నైలో నివాసం ఉంటున్న శాంతోమ్‌ లోని వీధి చివరిలో ఓ కంటెయినర్ లారీ గత పది రోజులుగా నిలిచివుండటం, దానికి నంబర్ ప్లేట్ లేకపోవడం సంచలనంగా మారింది. ఇక ఈ లారీని ఫొటో తీసిన కుష్బూ, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఇంటికి వెళ్లే వీధి ముందు నెంబర్‌ ప్లేట్‌ లేని కంటైనర్‌ గత 10 రోజులుగా నిలిపివుందని, ప్రజలెవరూ దీన్ని పట్టించుకోవడం లేదని ఆమె ట్వీట్ చేశారు. ఇది అనుమానాస్పదంగా ఉందని వెంటనే ఈ విషయాన్ని చెన్నై పోలీసులు త్వరగా చూడాలని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఖుష్బూ చేసిన పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీ వీధిలో ఉంటే వేరే ఎవరో ఎందుకు ఫిర్యాదు చేయాలి మీరెందుకు చేయరు ? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కూడా స్పందించిన ఖుష్బూ లారీ తన వీధిలో లేదని వీధి చివరన ఉందని. తన వీధిలో ఉండి ఉంటే తానే ఫిర్యాదు చేసేదాన్నని ఆమె పేర్కొన్నారు.

The post నటి ఖుష్బూ ఇంటిదగ్గర్లో అనుమానాస్పద వెహికల్…ట్వీట్ appeared first on Telugu Bullet.