X Close
X
+91-9866010944

ఇటలీలో అధికంగా ఉన్న కరోనా తీవ్రత


kkr-696x392

ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 75వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7వేల 479 మంది పరిస్థితి విషమంగా ఉంది. 11వేల 385మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.తాజాగా కరోనా మరణాల్లో చైనాను ఇటలీ దాటిపోయింది. ఇటలీలో ఒక్క రోజులోనే 627 కరోనా మరణాలు నమోదయ్యాయి.

దీనితో ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 4వేల 32కి చేరింది. చైనాలో 3వేల 248 మంది చనిపోయారు. స్పెయిన్ ఇరాన్ లోనూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్ లో 1093 మంది ఇరాన్ లో 1433 మంది ఫ్రాన్స్ లో 372మంది చనిపోయారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 218కి చేరింది. ఇండియా లో ఇప్పటివరకు ఐదు మంది చనిపోయారు. కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మృతుల సంఖ్య 11వేలకు దాటడం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది.

కాగా ఇండియాలో కూడా కరోనా భారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. దేశంలో లక్షణాలు కనిపించిన లక్షలమందికి ప్రభుత్వాలు ఉచితంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250కు చేరింది. శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. . దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులో నమోదయ్యాయి.

The post ఇటలీలో అధికంగా ఉన్న కరోనా తీవ్రత appeared first on Telugu Bullet.

(TELEGU BULLET)