X Close
X
+91-9866010944

సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ


vn-696x418

ఈనెల 20న దివంగ‌త ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల జ‌యంతి. ఈ సంద‌ర్భంగా విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌బోతున్నారు. నాన‌క్‌రామ్ గూడ‌లో కృష్ణ నివాసంలోనే ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మ‌హేష్ బాబు చేతుల మీదుగా ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా ఎన్నో మ‌ర‌పు రాని చిత్రాల్ని అందించారు విజ‌య నిర్మ‌ల‌. గ‌తేడాదే అనారోగ్యంతో క‌న్నుమూశారు. విజ‌య‌నిర్మ‌ల లేక‌పోవ‌డంతో ఒంట‌రి అయిపోయారు కృష్ణ‌. ఇప్పుడు నాన‌క్ రామ్ గూడాలోనే ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు. కృష్ణ కోరిక మేర‌కే ఈ విగ్ర‌హాన్ని అక్క‌డ ప్ర‌తిష్టించారు. ఈ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కృష్ణ‌, న‌రేష్‌, మ‌హేష్‌ల‌తో పాటు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సంతోష్ త‌దిత‌రులు పాల్గొన‌బోతున్నారు.

The post సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ appeared first on Telugu Bullet.

(TELEGU BULLET)