విజయవాడ సమీపంలోని చిట్టినగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్క్ ప్రాజెక్ట్ సమీపాన ఉన్న పాత ప్రసాద్ థియేటర్‌లో అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. థియేటర్ మూతపడటంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద తీవ్రతకు చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
The post విజయవాడ సమీపంలో భారీ అగ్నిప్రమాదం appeared first on Telugu Bullet.
(TEL BULLET)