X Close
X
+91-9866010944

వంశీకి ముద్దిచ్చిన మహేష్…ఇంకేం అడగరట 


Hyderabad: ఊహించినట్టుగానే మహర్షి సూపర్ హిట్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్‌బాబు. ఆయనతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం ప్రస్తుతం ‘మహర్షి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సుమారు మూడేళ్ల విరామం తరవాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ రేంజ్ హిట్ కావడంతో ఆయన ఆనందం పట్టలేకున్నాడు. 2016లో ‘ఊపిరి’ సినిమాను తెరకెక్కించిన వంశీ ఆ తరవాత ‘మహర్షి’ స్క్రిప్టుపైనే పనిచేశారు. దేశంలో రైతులు పడుతోన్న కష్టాలు, నిరాదరణకు గురవుతోన్న వ్యవసాయాన్ని ఇతివృత్తంగా చేసుకుని కథను అల్లుకున్నారు. ఇలాంటి బలమైన స్క్రిప్టుకు మహేష్‌ బాబు లాంటి హీరో తోడవడంతో ‘మహర్షి’ భారీ హిట్ గా నిలిచింది. అయితే తనకు ఇంతటి హిట్ ను ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను వంశీ ట్విట్టర్‌లో పెట్టి.. ‘నాకు ఎంతో మధుర క్షణం.. ఇంతకు మించి ఏమీ అడగను’ అని క్యాప్షన్ పెట్టారు. అలాగే.. తన కుమార్తె, మహేష్ బాబు, సితారలతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ఈ రెండు ఫొటోల్లో వంశీకి మహేష్ బాబు ముద్దు పెడుతోన్న ఫొటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

The post వంశీకి ముద్దిచ్చిన మహేష్…ఇంకేం అడగరట  appeared first on Telugu Bullet.