X Close
X
+91-9866010944

మ్యాన్‌హోల్‌లో ప‌డ్డ చిన్నారి..


Hyderabad:

ముంబైలోని ఓ మ్యాన్‌హోల్‌లో ఏడాదిన్న‌ర వ‌య‌సున్న చిన్నారి దివ్యాంశ్ ప‌డిపోయాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం రాత్రి గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలో జ‌రిగింది. డ్రెయినేజీలో ప‌డ్డ చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. రోడ్డు మీద తిరుగుతున్న చిన్నారి.. ఓ ఎల‌క్ట్రిక‌ల్ బాక్సు ప‌క్క‌న ఉన్న భారీ రంధ్రంలో ప‌డిపోయాయి. ఆ డ్రెయినేజీ సుమారు ఫీట్ల లోతు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ముంబైలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో డ్రెయినేజీలో నీరు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది. తొమ్మిది గంట‌ల నుంచి చిన్నారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది.

The post మ్యాన్‌హోల్‌లో ప‌డ్డ చిన్నారి.. appeared first on Telugu Bullet.