X Close
X
+91-9866010944

భర్త సాయంతో భార్యపై మంత్రగాడి అఘాయిత్యం..


Hyderabad:

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ వికృతంగా మారుతున్నాయి. కుటుంబంలో బలహీనతలను అడ్డం పెట్టుకొని కొంతమంది కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబంపై మంత్రగాడు కన్నేశాడు. ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తానని చెప్పి మహిళను అత్యాచారం చేసేశాడు. కాగా ఈ ఘటన తాజాగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో వెలుగు చూసింది.

అదేమంటే… మల్కాజ్ గిరి ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో భార్యాభర్తలు నిజామాబాద్ లోని మష్రూద్ అనే మంత్రగాడిని సంప్రదించారు. అలా తన వద్దకు వచ్చిన మహిళపై కన్నేసిన మంత్రగాడు, ఆర్ధిక ఇబ్బందులకు భార్యే కారణమని.. ఆమెను దెయ్యం ఆవహించిందని, ఆ దెయ్యాన్ని వదలగొడితే ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారని మాయచేశాడు. దాంతో ఆ భర్త తన భార్యను అక్కడే వదిలేసి వెళ్ళాడు. దీంతో ఆ మంత్రగాడు మహిళను బెదిరించి అత్యాచారం చేసేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య జరిగిన విషయం చెప్పింది. కానీ.. భర్త అవేమీ పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మంత్రగాడిని, భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

The post భర్త సాయంతో భార్యపై మంత్రగాడి అఘాయిత్యం.. appeared first on Telugu Bullet.