X Close
X
+91-9866010944

ఫ్రీగా భోంచేసేందుకే జర్నలిస్టులట !


Hyderabad:

నటి కంగనా రనౌత్, జర్నలిస్టులకు మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. ఈ నెల 7వ తేదీన తన తాజా చిత్రం ‘మెంటల్ హై క్యా’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో కంగన మాట్లాడుతూ, ‘మణికర్ణిక’ చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడారు. దీంతో, కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని… అంతవరకు ఆమెకు మీడియా కవరేజ్ ఇవ్వబోమని ‘ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది. కంగనా మాత్రం చెప్పలేదు. అంతేకాదు, మీడియాను దుర్భాషలాడుతూ వీడియోను విడుదల చేసింది. ‘ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే, నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?’ అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మణికర్ణిక’ సినిమా సమయంలో మూవీ మాఫియా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు… తనకు అండగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది.

The post ఫ్రీగా భోంచేసేందుకే జర్నలిస్టులట ! appeared first on Telugu Bullet.