X Close
X
+91-9866010944

పోసాని చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు..నారా బ్రాహ్మీనికి కౌంటర్..!


Hyderabad:

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కామెంట్స్ కు పోసాని కౌంటర్ ఇచ్చారు .ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పు ఒప్పుకోవాలని చంద్రబాబు ఏడాది పాటు జైల్లో ఉండి బయటికి వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలో 17 సార్లు కోర్టుల నుంచి చంద్రబాబు స్టేట్ తెచ్చుకున్నారని విమర్శించారు.

చంద్రబాబుకు దోమతెరలు ఏసీ ఏర్పాటుపై చర్చ సాగుతున్న తరుణంలో చంద్రబాబుకు దోమలు కరుస్తుంటే దోమల మందు, ఏసీ, దోమలతెరలు నేను కొనిస్తా ఇచ్చి రండి అంటూ టీడీపీ నేతలకు సెటైర్లు వేశారు. నారా బ్రాహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ సెటైర్లు వేశారు. బ్రాహ్మిని మాటలు వింటే జడ్జ్ మీద కూడా కేసులు పెట్టలేము అని కౌంటర్ ఇచ్చారు. నారా బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీ తాతయ్య నువ్వు వెన్నుపోటు పొడిచింది ఎవరు? చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్యని చంపింది ఎవరు? బ్రాహ్మిని చెప్పాలంటూ పోసాని కృష్ణమురళి సవాల్ చేశారు .

The post పోసాని చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు..నారా బ్రాహ్మీనికి కౌంటర్..! appeared first on Telugu Bullet.