కరోనా మహమ్మరి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం తగ్గకపోవడంతో మే 3 తరువాత కూడా లాక్‌డౌన్ పొడిగించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సుముఖంగా ఉండడంతో లాక్‌డౌన్ పొడిగింపు ఖచ్చితమనే అర్ధమవుతుంది.
అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు పుణరాలోచనలో పడింది. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలు తెలుపుతారు అనే దానిపైనే అటు విద్యార్థులలో వారి తల్లిదండ్రులలో సందిగ్ధం నెలకొంది. అయితే వీటన్నిటిని పక్కనపెడితే తాజాగా సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు CBSE తెలిపింది.
The post పరీక్షలను రద్దు చేసిన CBSE appeared first on Telugu Bullet.
(TEL BULLET)