దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది.
ఇక దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 4, 209 కరోనా బాధితులు మృతి చెందారు.కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,91,331కు చేరింది.దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.12 శాతం గా వుంది.
గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,57,295 కరోనా బారి నుంచి కోలుకున్నారు.దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 87.25 శాతం గా వుంది. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 20,61,683 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
The post దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి appeared first on Telugu Bullet.
(TEL BULLET)