X Close
X
+91-9866010944

తల్లిదండ్రుల శవాలతో రెండేళ్ల చిన్నారి నరకయాతన…9 రోజుల పాటు


Man-rapes

ఉక్రేయిన్‌ లోని కియేవ్‌ లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్థులో విక్టోరియా దెవ్యత్కైన్ (27), ఆమె భర్త, చిన్నారి నివసిస్తున్నారు. మే 2వ తేదీ తర్వాత ఆ ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేదు. మే 12న విక్టోరియా ఫ్లోరు నుంచి దుర్వాసన వస్తోందని అపార్ట్‌మెంటువాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇళ్లంతా చిందరవందరగా ఉంది. భార్యాభర్తల శవాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వాటికి సమీపంలో రెండేళ్ల చిన్నారి కదల్లేని పరిస్థితిలో ఉంది. దీంతో షాకైన పోలీసులు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ తీసుకున్న సిరంజీలు చిందరవందరగా పడివున్నాయి. దీంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా లేదా డ్రగ్స్ వికటించి చనిపోయారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఆ సిరంజీలను ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తెలియక ఆ చిన్నారి 9 రోజులుగా ఆ ఫ్లాట్‌లో శవాలతోనే ఉంది. తలుపు గడియపెట్టి ఉండటంతో బయటకు కూడా వెళ్లలేకపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు మాట్లాడుతూ.. వారం రోజులుపైగా ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్ల చిన్నారి డీహైడ్రేషన్‌కు గురైందని కనీసం నుంచోడానికి కూడా ఆమెకు శక్తి లేదని అయితే, ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు.

The post తల్లిదండ్రుల శవాలతో రెండేళ్ల చిన్నారి నరకయాతన…9 రోజుల పాటు appeared first on Telugu Bullet.

(TEL BULLET)