జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తుని కేటాయించింది . ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన. ” తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి ఏడు లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు అప్పట్లో పోటీలో నిలిచారు.
ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
The post కేంద్ర ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు..! appeared first on Telugu Bullet.