ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 తాలూకు విక్రమ్ ల్యాండర్ గురించి ఇంకా ఉత్కంఠ వీడట్లేదు. చంద్రుడిపై హార్డ్ ల్యాండ్ అయిన విక్రమ్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇదివరకే ప్రకటించింది. విక్రమ్ దిగినట్టుగా భావిస్తున్న ప్రాంతంపైకి తాము ప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్ ఈ నెల 17న రానున్నట్టు గతంలో తెలిపింది. ఈ సమయంలో విక్రమ్ ఫొటోలు తీయడానికి ఎల్‌ఆర్‌ఓ ప్రయత్నిస్తుందని నాసా పేర్కొంది. ఈ ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని కూడా నాసా వెల్లడించింది. అయితే, మంగళవారం అర్థరాత్రి దాటేవరకూ విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను నాసా విడుదల చేయలేదు. మరోవైపు చంద్రయాన్-2 మిషన్‌లో తమ వెన్నంటి ఉన్న భారతీయులకు ఇస్రో మంగళవారం ధన్యవాదాలు తెలిపింది. భారతీయుల ఆకాంక్షలతో, కలలతో స్ఫూర్తి పొందుతూ మేము మున్ముందుకు సాగుతాం. అత్యున్నత లక్ష్యాలను సాధించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతలు అని ఇస్రో ట్వీట్ చేసింది.
The post ఇంకా విడుదల కాని నాసా ఫోటోలు appeared first on Telugu Bullet.
(TEL BULLET)